- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి : ఏలే మల్లికార్జున్
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం ద్వారా అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాల ఫలాలు అందాలని జిల్లా డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పేర్కొన్నారు.

దిశ, నిజాంసాగర్ : అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం ద్వారా అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాల ఫలాలు అందాలని జిల్లా డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పేర్కొన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను శనివారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ లబ్ధిదారులకు అందజేశారు.
మండలంలోని బంజపల్లి, మాగి, వడ్డేపల్లి, మల్లూరు గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులు ఈ సందర్భంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందుకున్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అవసరమైన సమయంలో అండగా నిలవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పేద కుటుంబాలు వైద్య చికిత్సల కోసం అప్పుల పాలవకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఇది ఎంతో మంది నిరుపేదలకు ప్రాణాధారంగా మారింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది అని తెలిపారు.
అలాగే జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రత్యేక చొరవ, నిరంతర కృషి వల్ల నియోజకవర్గంలోని అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు త్వరితగతిన మంజూరై అందుతున్నాయని చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. ప్రతి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నాం. ప్రజలకు అవసరమైన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేయడంలో ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు సాగుతోంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు బొజ్జ అంజయ్య, వడ్ల బ్రహ్మం, ఉప సర్పంచ్ అనీస్ పటేల్, నాయకులు, గాండ్ల రమేష్,సత్య గౌడ్, పసుల రాములు, ముజీబ్, బుడిమి శ్రీనివాస్, ఊరటి వెంకట్, శ్రీనివాస్ రెడ్డి, మోహన్ రెడ్డి,కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.






