- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీలో కొప్పుల గోపాలరావుకు గోల్డ్ మెడల్
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ కొప్పుల గోపాలరావు జాతీయ స్థాయిలో మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు.

దిశ, పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ కొప్పుల గోపాలరావు జాతీయ స్థాయిలో మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ ఆధ్వర్యంలో నిర్వహించిన 10వ నేషనల్ డిజిటల్ సర్క్యూట్–2026 ఫోటోగ్రఫీ పోటీల్లో పాల్గొని రెండు గోల్డ్ మెడల్స్‌ను సొంతం చేసుకున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఫోటోగ్రాఫర్ల మధ్య జరిగిన ఈ పోటీల్లో గోపాలరావు సమర్పించిన ఛాయాచిత్రాలు న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నాయి. ఎఫ్‌ఐపీ మెన్, ఉమెన్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రెండు స్వర్ణ పతకాలను అందుకున్నారు. ఈ విజయం ఖమ్మం జిల్లా, ముఖ్యంగా పెనుబల్లి మండలానికి గర్వకారణంగా నిలిచింది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన గోపాలరావును కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఫోటోగ్రాఫర్లు, కళాభిమానులు, పలువురు ప్రముఖులు అభినందిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.






