భార్య కాపురానికి రావట్లేదని భర్త ఏం చేశాడో తెలిస్తే షాక్!

by Jakkula.Mamatha |

భార్య కాపురానికి రావడం లేదని యాసిడ్ తాగి భర్త ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొండాపూర్‌లో జరిగింది.

భార్య కాపురానికి రావట్లేదని భర్త ఏం చేశాడో తెలిస్తే షాక్!
X

దిశ, ఘట్కేసర్: భార్య కాపురానికి రావడం లేదని యాసిడ్ తాగి భర్త ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొండాపూర్‌లో జరిగింది. బాధితుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ సర్కిల్ కొండాపూర్‌లో నివాసం ఉంటున్న పల్లపు మల్లేష్(36), కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం మల్లేష్‌కు తన భార్యకు గొడవ జరిగి భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో మనస్తాపం చెందిన మల్లేష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం సుమారు 3 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్న యాసిడ్‌ను తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబీకులు తెలిపారు. వాంతులు, విరేచనాలై మల్లేష్ తీవ్ర ఆస్వస్థతకు గురవడంతో స్థానికులు 108కి‌ సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌లోనే ఈ.ఏం.టి రవి, పైలట్ రవితేజ అత్యవసర వైద్యం అందిస్తూ గాంధీ ఆసుపత్రికి తరలించగా మల్లేష్ పరిస్థితి కొంత మెరుగు పడిందని, ప్రాణాపాయం నుంచి తప్పినట్టు 108 సిబ్బంది తెలిపారు.

Next Story