పుట్టింటికి వెళ్లిన భార్య.. మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న భర్త!

by Jakkula.Mamatha |

భార్యాభర్తల కాపురంలో చెలరేగిన కలతలు చివరికి భర్త ప్రాణాలను బలిగొంది.

పుట్టింటికి వెళ్లిన భార్య.. మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న భర్త!
X

దిశ, వెల్గటూర్: భార్యాభర్తల కాపురంలో చెలరేగిన కలతలు చివరికి భర్త ప్రాణాలను బలిగొంది. భార్య ఉదయం పుట్టింటికి వెళ్లగా తీవ్ర మనస్తాపం చెందిన భర్త మధ్యాహ్నం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన విషాద ఘటన ఇది. వెల్గటూర్ మండలం ముక్కట్రావు పేట గ్రామానికి చెందిన మేకల గణేష్(25) అనే వ్యక్తి శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు రోజు భార్యాభర్తలు ఇద్దరు కలిసి హైదరాబాద్ వెళ్లారు. అక్కడే ఉండి పని చేసుకుంటూ బతకాలని అనుకున్నారు. అయితే సరైన పని దొరకకుండా ఇంటికి తిరిగి వచ్చారు. రాత్రి ఇరువురి మధ్యలో చిన్న గొడవ జరిగినట్లు సమాచారం. తెల్లవారగానే భార్య పుట్టింటికి వెళ్లి భర్త మనస్తాపంతో బాగా మద్యం సేవించి అదే మైకంలో ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story