- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోంమంత్రిగా రేవంత్ రాజీనామా చేయాలి : హరీష్ రావు డిమాండ్
రంగారెడ్డి జిల్లా షాబాద్ లో ఆరుగురి హత్యలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా షాబాద్ లో ఆరుగురి హత్యలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు. ఆ ఆరుగురిని పోక్సో కేసు నిందితుడైన వ్యక్తి హత్య చేయడం అత్యంత హృదయ విదారకమన్నారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ హోంశాఖను తనవద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. హోంమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హోంమంత్రిగా రేవంత్ పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఈ కేసులో ఎస్సైని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్న సీఎం.. ఏ మాత్రం మానవత్వం ఉన్నా వెంటనే రాజీనామా చేయాలన్నారు.
షాబాద్ మండల పరిధిలోని దైవాలగూడకు చెందిన రాజ్ కుమార్ శుక్రవారం అర్ధరాత్రి ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోక్సో కేసులో అరెస్టై బెయిల్ పై తిరిగి వచ్చిన రాజ్ కుమార్.. కట్టుకున్న భార్య సరిత, తన ఇద్దరు కొడుకులు, తనపై పోక్సో కేసుపెట్టిన మైనర్ బాలిక, ఆమె తల్లి లక్ష్మి, నానమ్మ రుక్కమ్మలను కత్తితో నరికి చంపాడు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. హత్యల అనంతరం తన తండ్రికి ఫోన్ చేసి ఆరుగురిని చంపానని, తాను కూడా చనిపోతున్నట్లు చెప్పడంతో ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు ఆరుగురి మృతదేహాలను పోస్టుమార్టమ్ కు తరలించారు. కాగా.. నిందితుడు తన భార్య, పిల్లల్ని సైతం హత్య చేయడం పోలీసుల్ని విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.






