- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సేకరించిన ఓటర్ల వివరాలను డిజిటలైజేషన్ చేయాలి
రోజుకు 100 ఓటర్ల వివరాలను డిజిటలైజేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి బిఎల్ఓ లను ఆదేశించారు.

దిశ, వికారాబాద్ ప్రతినిధి: రోజుకు 100 ఓటర్ల వివరాలను డిజిటలైజేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి బిఎల్ఓ లను ఆదేశించారు. శనివారం వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆలంపల్లి కొత్త గడి వార్డులలో ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఏ ఒక్కరూ ఓటు హక్కును కోల్పోకుండా ప్రతి ఇంటి నుంచి ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకొని డిజిటలైజేషన్ చేయాలని బిఎల్ఓ లకు కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ సెలవు ఉన్నందున తప్పనిసరిగా ఎస్ఐఆర్ ను చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. వార్డులలో విద్యావంతులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహకారం తీసుకొని ఎస్ఐఆర్ ను వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో బిఎల్వోలు ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఓటర్ల నమోదుకు ఇచ్చిన ఫారాలను సేకరించే బాధ్యత కూడా బిఎల్వోలదేనని అన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) సచిన్ బస్వరాజ్ గుట్టూరు డిఆర్ఓ స్వర్ణలత తహసీల్దార్ లక్ష్మీనారాయణ మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి లు ఉన్నారు.






