- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాదగిరిగుట్టను దేశంలోనే ఆదర్శ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలి
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా, రాష్ట్రానికి తలమానికంగా తీర్చిదిద్దేందుకు నూతన ట్రస్ట్ బోర్డు సమిష్టిగా కృషి చేయాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా, రాష్ట్రానికి తలమానికంగా తీర్చిదిద్దేందుకు నూతన ట్రస్ట్ బోర్డు సమిష్టిగా కృషి చేయాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. శనివారం యాదగిరిగుట్టలో నిర్వహించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేవస్థానానికి చేరుకున్న మంత్రి కొండా సురేఖకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, దేవస్థానం ఈవో జె. భవానీశంకర్ స్వామి వారి చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.
మంత్రి సమక్షంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎం. సత్యనారాయణ రెడ్డి, సభ్యులు, ఎక్స్‌అఫీషియో సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. అనంతరం నూతన చైర్మన్, సభ్యులను మంత్రి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. యాదగిరిగుట్టకు తొలి ట్రస్ట్ బోర్డుగా నియమితులైన చైర్మన్, సభ్యులు ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేస్తూ ఆలయ అభివృద్ధి, పారదర్శక పాలన, భక్తులకు మరిన్ని సౌకర్యాల కల్పన పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆలయ పవిత్రత, సంప్రదాయాలను పరిరక్షిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని, ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ సమన్వయంతో పనిచేసి దేవస్థానం ఖ్యాతిని మరింత పెంచాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఎక్స్‌అఫీషియో సభ్యులు, ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.






