- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TRAI: 1600 నుంచి వచ్చే కాల్స్ బ్లాక్ చేయద్దు
మరోవైపు, 140 సిరీస్ నంబర్లు రిజిస్టర్ అయిన టెలిమార్కెటింగ్, ప్రమోషన్స్ కోసం మాత్రమే ఉద్దేశించినవని వివరించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: 1600 సిరీస్ నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను ఏ కాలర్ ఐడీ లేదా స్పామ్-బ్లాకింగ్ యాప్ కూడా బ్లాక్ చేయడం, ట్యాగ్ చేయడం లేదా ఫిల్టర్ చేయడానికి వీల్లేదని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) స్పష్టం చేసింది. ఈ నంబర్లు సాధారణ ప్రమోషనల్స్ కాల్స్ కోసం కాకుండా, ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థలు, ఆర్థిక సేవల సంస్థలు తమ ప్రస్తుత వినియోగదారులకు అందించే సేవలు, లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేకంగా కేటాయించినవని తెలిపింది. ఈ కారణంగా ఇలాంటి కాల్స్‌పై ప్రజల్లో నమ్మకం ఉండేలా 1600 సిరీస్‌కు ప్రత్యేక రక్షణ కల్పించినట్లు ట్రాయ్ పేర్కొంది. మరోవైపు, 140 సిరీస్ నంబర్లు రిజిస్టర్ అయిన టెలిమార్కెటింగ్, ప్రమోషన్స్ కోసం మాత్రమే ఉద్దేశించినవని వివరించింది.
140 సిరీస్ కాల్స్‌ను వినియోగదారులు డీఎన్‌డీ రిజిస్ట్రీ ద్వారా మాత్రమే బ్లాక్ చేయడంపై నిర్ణయించుకోవచ్చు. అయితే డీఎన్‌డీ ద్వారా బ్లాక్ చేయడం తప్ప, 140 నంబర్లను కూడా స్పామ్ లేదా మోసపూరిత కాల్స్‌గా యాప్‌లు ట్యాగ్ చేయడం లేదా ఫిల్టర్ చేయడం నిబంధనలకు విరుద్ధం. ఎందుకంటే, డీఎన్‌డీలో ఇప్పటికే అనుమతి ఇచ్చిన ప్రమోషనల్ కాల్స్‌ను కూడా వినియోగదారులు పొరపాటున స్పామ్‌గా భావించే అవకాశం ఉందని ట్రాయ్ వివరణ ఇచ్చింది. మరోవైపు, 140, 1600 సిరీస్ నంబర్ల నుంచి వచ్చే స్పామ్ కాల్స్ పెరుగుతున్నాయని ట్రూకాలర్ ఆందోళన వ్యక్తం చేసింది. సంస్థ సీఈఓ రిషిత్ ఝున్‌ఝున్‌వాలా మాట్లాడుతూ, ఈ రెండు సిరీస్‌ల నుంచి రోజుకు 5.1 కోట్లకు పైగా కాల్స్‌కు కస్టమర్లు స్పందించడం లేదు. అలాగే ట్రూకాలర్ యూజర్లు ప్రతిరోజూ సుమారు 4 లక్షల 140 సిరీస్ కాల్స్, 1.25 లక్షల 1600 సిరీస్ కాల్స్‌ను మాన్యువల్‌గా బ్లాక్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ట్రాయ్ నిబంధనల ప్రకారం, 1600 నంబర్లను యాప్‌ల ద్వారా స్పామ్‌గా గుర్తించడం లేదా ఆటోమేటిక్‌గా బ్లాక్ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.






