త్వరలో థియేటర్లలో కలుద్దాం.. ‘జననాయగన్’ నుంచి సరికొత్త పోస్టర్ పంచుకున్న విజయ్

by Chukka Sudharani |

కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు సీఎం దళపతి విజయ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైమ్ రానే వచ్చింది.

త్వరలో థియేటర్లలో కలుద్దాం.. ‘జననాయగన్’ నుంచి సరికొత్త పోస్టర్ పంచుకున్న విజయ్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు సీఎం దళపతి విజయ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైమ్ రానే వచ్చింది. ఆయన నటిస్తున్న ఆకరి చిత్రం ‘జననాయగన్’ విడుదలకు సిద్ధం అయింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెన్సార్ సమస్యల కారణంగా వాయిదాల మీద వాయిదలు పడుతూనే వచ్చింది. ఎట్టకేలకు సెన్సార్ ఈ సినిమాకు ‘A’ సర్టిఫికేట్ జారీ చెయ్యగా.. త్వరలోనే థియేటర్స్‌లో కలుద్దాం అంటూ సరికొత్త పోస్టర్‌ను షేర్ చేశాడు విజయ్. ఇందులో ఆయన స్టైలిష్ లుక్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. కాగా.. హెచ్. వినోత్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌కు సంబంధించిన రిలీజ్ డేట్ మాత్రం పోస్టర్‌లో మెన్షన్ చేయలేదు మేకర్స్. కానీ నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. ఈ సినిమా జులై 24 గ్రాండ్ థియేట్రికల్‌కు తీసుకొచ్చే ప్రయత్నం ఉన్నట్లు టాక్.

Next Story