- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వియత్నాం బోటు ప్రమాదంపై మంత్రి లోకేశ్ ఆరా : అధికారులకు కీలక ఆదేశాలు
వియత్నాంలో విహారయాత్రకు వెళ్లిన భారతీయ పర్యాటకుల బోటు ఫూ క్వాక్ ద్వీపం సమీపంలో బోల్తా పడగా.. 15 మంది ప్రాణాలు కోల్పోయారు.

దిశ, వెబ్‌డెస్క్: వియత్నాంలో విహారయాత్రకు వెళ్లిన భారతీయ పర్యాటకుల బోటు ఫూ క్వాక్ ద్వీపం సమీపంలో బోల్తా పడగా.. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఏపీకి చెందిన ముగ్గురు మరణించగా.. మరొక వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మచిలీపట్నానికి చెందిన కిశోర్ తీవ్ర అస్వస్థతకు గురవ్వగా.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. వియత్నాంలోని భారత ఎంబసీ అధికారులతో మాట్లాడి.. వెంటనే బాధితులకు, వారి కుటుంబాలకు సహాయం అందేలా చూడాలని కోరారు. ప్రమాదంలో చిక్కుకున్న తెలుగువారందరికీ అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వియత్నాంలో జరిగిన బోటుప్రమాద ఘటనపై దేశ, రాష్ట్ర ఉన్నతాధికారులతో నారాలోకేశ్ మాట్లాడారు.
అలాగే ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సైతం మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఏపీ నుంచి విహారయాత్రకు వెళ్లిన పర్యాటకుల వివరాలు వెంటనే పంపాలని ఆదేశించారు. బోటు ప్రమాదంపై ఎప్పటికప్పుడు భారత రాయబార కార్యాలయంతో మాట్లాడుతున్నామని అధికారులు మంత్రికి తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వంతో అధికారులు సమన్వయం చేసుకుని బాధితులకు సహాయం అందించాలని లోకేశ్ ఆదేశించారు.






