- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్టిఫికెట్లు ఇవ్వకుంటే గుర్తింపు రద్దు చేస్తాం : డీఐఈఓ
ఫీజుల బకాయిల పేరుతో విద్యార్థులకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు (టీ.సీ), బోనాఫైడ్ సర్టిఫికెట్లు, ఇతర ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా వేధింపులకు పాల్పడే ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) తిరుమలపూడి రవికుమార్ హెచ్చరించారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఫీజుల బకాయిల పేరుతో విద్యార్థులకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు (టీ.సీ), బోనాఫైడ్ సర్టిఫికెట్లు, ఇతర ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా వేధింపులకు పాల్పడే ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) తిరుమలపూడి రవికుమార్ హెచ్చరించారు. ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశాల మేరకు నిబంధనలు ఉల్లంఘించే కళాశాలల గుర్తింపును రద్దు చేసేలా చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. గత మార్చి వార్షిక పరీక్షలు, మే సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల పై చదువుల కోసం అవసరమైన సర్టిఫికెట్లు వారికి వెంటనే అందజేయాలని కళాశాల యాజమాన్యాలకు సూచించారు. ఫీజుల చెల్లింపు పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం బోర్డు నిబంధనలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నట్లు ఫిర్యాదులు అందితే సంబంధిత కళాశాలల పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సర్టిఫికెట్ల జారీ విషయంలో ప్రైవేటు కళాశాలలు ఇబ్బందులు కలిగిస్తే విద్యార్థులు, తల్లిదండ్రులు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న కళాశాలల వివరాలను ఇంటర్ బోర్డుకు నివేదిస్తామని డీఐఈఓ తిరుమల పూడి రవికుమార్ వెల్లడించారు.






