- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చదువుల కోసం లండన్‌కు వెళ్లిన యువకుడు.. విగతజీవిగా స్వగ్రామానికి
by Batti.Sumithra |
మండలంలోని తలమడ్ల గ్రామానికి చెందిన సావుసాని శ్రీనాథ్ రెడ్డి(25) ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లి గత నెల 23వ తేదీ అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు.

X
దిశ, రాజంపేట్ : మండలంలోని తలమడ్ల గ్రామానికి చెందిన సావుసాని శ్రీనాథ్ రెడ్డి(25) ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లి గత నెల 23వ తేదీ అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. కాగా శనివారం మధ్యాహ్నం మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. 18 రోజుల నుంచి స్వగ్రామానికి శ్రీనాథ్ రెడ్డి మృతి దేహాన్ని రప్పించడానికి కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రభుత్వం ద్వారా ప్రయత్నించారు. దీంతో శనివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి శ్రీనాథ్ రెడ్డి మృతదేహం చేరుకుంది. అంబులెన్స్ ద్వారా స్వగ్రామానికి తీసుకొచ్చి శనివారం సాయంత్రం కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తుల అశ్రునయనాల మధ్య శ్రీనాథ్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లి విగత జీవిగా స్వగ్రామానికి చేరుకోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story






