- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాబాద్ ఘటన.. పోలీసులు కీలక ప్రకటన
షాబాద్ ఆరు హత్యల ఘటనపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. నిందితుడు రాజ్ కుమార్‌ను పట్టిస్తే రూ.2 లక్షల రివార్డు ఇస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామానికి చెందిన రాజ్ కుమార్ ఓ బాలికను వేధించాడంటూ ఈ ఏడాది మే 16న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దిశ, వెబ్ డెస్క్: షాబాద్ ఆరు హత్యల ఘటనపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. నిందితుడు రాజ్ కుమార్‌ను పట్టిస్తే రూ.2 లక్షల రివార్డు ఇస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామానికి చెందిన రాజ్ కుమార్ ఓ బాలికను వేధించాడంటూ ఈ ఏడాది మే 16న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడిని మే 26న అరెస్ట్ చేశారు. శుక్రవారం నిందితుడు బెయిల్ పై విడుదలై గ్రామానికి తిరిగి వచ్చాడు.
శనివారం తెల్లవారుజామున నేరుగా ఇంటికి వెళ్లి తన భార్య సరిత, మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడిని కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం నేరుగా తనపై కేసు పెట్టిన బాలిక ఇంటికి వెళ్లి ఆమె తల్లి, నానమ్మను అదే కత్తితో హత్య చేశాడు. అక్కడితో ఆగకుండా బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడి అనంతరం హతమార్చాడు. ఆ తరవాత నిందితుడు తన తండ్రికి ఫోన్ చేసి తాను హత్యలు చేశానని, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. వెంటనే అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే ఇప్పటి వరకు నిందితుడిని ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులు అతడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించారు.






