- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు దాటుతుండగా విషాదం.. స్కూటీ ఢీకొట్టి కిందపడిన వ్యక్తిపై కారు దూసుకెళ్లి మృతి
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, నంగునూరు: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు దిగి రోడ్డు దాటుతున్న వ్యక్తిని ముందుగా స్కూటీ ఢీకొట్టగా, కిందపడిన అతడిపై అదే సమయంలో అటుగా వచ్చిన కారు దూసుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాంపూర్ ఎక్స్‌రోడ్ వద్ద జరిగింది. రాజగోపాల్‌పేట ఎస్సై వివేక్ తెలిపిన వివరాల ప్రకారం.. నంగునూరు మండల కేంద్రానికి చెందిన బీమా పవర్ (38) తన కుమారుడు అరవింద్ పవర్‌తో కలిసి జిల్లెల్ల గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యాడు. అనంతరం తిరుగు ప్రయాణంలో రాంపూర్ ఎక్స్‌రోడ్ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా, బద్దిపడగ వైపు నుంచి సిద్దిపేట దిశగా స్కూటీపై వస్తున్న నర్మేట సాయి వారిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో తండ్రి, కుమారుడు ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో బద్దిపడగ వైపు నుంచి హైదరాబాద్‌కు చెందిన సంతోష్‌కుమార్ నడుపుతున్న కారు వేగంగా వచ్చి బీమా పవర్‌ను ఢీకొట్టింది. దీంతో అతడు కారు కింద చిక్కుకుని కొంతదూరం ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో బీమా పవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు అరవింద్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. మృతుడి భార్య మీనా పవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రాజగోపాల్‌పేట ఎస్సై వివేక్ తెలిపారు.






