- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యం.. ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి
జర్నలిస్టులకు తోడ్పాటు అందించిన అయ్యప్ప ఫౌండేషన్ రియల్లీ గ్రేట్ అనడంతో పాటు.. ప్రజలకు మేలు చేసే సమస్యలను జర్నలిస్టులు వెలికి తీస్తూ సమాజంలో మార్పు కోసం ప్రయత్నించాలని జూనియర్ సివిల్ జడ్జి సరళ రాణి చెప్పారు.

దిశ, ఆర్మూర్ : జర్నలిస్టులకు తోడ్పాటు అందించిన అయ్యప్ప ఫౌండేషన్ రియల్లీ గ్రేట్ అనడంతో పాటు.. ప్రజలకు మేలు చేసే సమస్యలను జర్నలిస్టులు వెలికి తీస్తూ సమాజంలో మార్పు కోసం ప్రయత్నించాలని జూనియర్ సివిల్ జడ్జి సరళ రాణి చెప్పారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో శనివారం నవనాథపురం ప్రెస్ క్లబ్ లోని జర్నలిస్టులకు అయ్యప్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రమాద భీమా పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుంకరి గంగా మోహన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్మూర్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి సరళ రాణి హాజరై మాట్లాడారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసే జర్నలిస్టులకు అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ ప్రమాద బీమా చేయించడం అభినందనీయమన్నారు.
వార్తా సేకరణ కోసం వెళ్లే జర్నలిస్టులకు ప్రమాద బీమా ఎంతో అవసరం అన్నారు. అదే కాకుండా జర్నలిస్టులు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలను కాపాడు కోగలుగు తామన్నారు. వృత్తితో పాటు ఆరోగ్యం సైతం ముఖ్యమని వివరించారు. రోడ్డు భద్రతా నియమాలు జర్నలిస్టులు స్వయంగా పాటిస్తూ.. సమాజంలోని ప్రజలు పాటించేలా జర్నలిస్టులు అవగాహన కల్పించాలన్నారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో జర్నలిస్టుల పాత్ర ముఖ్యమైందన్నారు. 24 గంటలు వార్తా సేకరణకు వెళ్లే జర్నలిస్టులకు ప్రమాద బీమా చేయించడం అభినందనీయమన్నారు. జర్నలిస్టులు సమాజంలో నున్న చెడును వెలికి తీసి నివారణకు కృషి చేయాలన్నారు. సమాజంలో జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. జర్నలిస్టు వృత్తితో కుటుంబాల పోషణ సాధ్యం కాకుండా సమాజంలో మార్పు కోసం జర్నలిస్టులుగా మీరు విధులు నిర్వహించడం అభినందనీయమన్నారు. అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా పేదలకు చేతనైనంత సహాయం చేస్తున్నానని చెప్పారు.
జర్నలిస్టులు అడగగానే ప్రమాద బీమా చేయించినట్లు వివరించారు. రాబోయే రోజుల్లో ఫౌండేషన్ ద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామన్నారు. జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అయ్యప్ప ఫౌండేషన్ ద్వారా మద్దతుగా ఉంటానన్నారు. అనంతరం నవనాథపురం జర్నలిస్టులకు ప్రమాద బీమా పత్రాలను న్యాయమూర్తి సరళారాణి, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ పంపిణీ చేశారు. నవనాథ పురం కార్యవర్గానికి ఫౌండేషన్ ద్వారా మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు సాత్ పుతే శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు షికారి శ్రీనివాస్, కార్యదర్శి మ్యాకల దినేష్, కోశాధికారి తొగర్ల రాజేందర్, సంయుక్త కార్యదర్శి అర్గుల్ అజీమ్, సలహాదారులు మంచిర్యాల నరేందర్, బారడ్ గణేష్, సభ్యులు గోజురు మహిపాల్, తమ్మె వినోద్, ఫౌండేషన్ ఉపాధ్యక్షులు చేపూర్ గణేష్, జర్నలిస్టులు విన్సెంట్, శ్రావణ్, ఇట్టేడి మోహన్ రెడ్డి, గణేష్ గౌడ్, గటడి అశోక్, చరణ్ గౌడ్, సామ సురేష్, వెంకటేశ్వర్ గుప్తా, మహేష్, లిక్కి శ్రావణ్, మోహన్ బాబు, గటడి అరుణ్, ఘటడి రాజ్ కుమార్, రాంపూర్ శ్రావణ్, చిరంజీవి, పోహార్ కిరణ్, నితీష్, విట్టల్, సంజీవ్, హనీఫ్ ఫౌండేషన్ సభ్యులు ఒడ్డెన్న, తదితరులు పాల్గొన్నారు.






