నితిన్ హీరోగా, నాని నిర్మాణంలో సినిమా.. హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ ఫిక్స్!

by Chukka Sudharani |

హీరో నితిన్ ప్రస్తుతం తన కెరీర్ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు.

నితిన్ హీరోగా, నాని నిర్మాణంలో సినిమా.. హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ ఫిక్స్!
X

దిశ, సినిమా: హీరో నితిన్ ప్రస్తుతం తన కెరీర్ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఆయన చేసిన వరుస చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాలు పొందుతున్నప్పటికీ నితిన్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఆయన కొత్త దర్శకులు నర్రి, సోము దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా.. దీనిని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. అలాగే 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రంపై అఫీషియల్ అప్డేట్ రాగా.. నేచురల్ స్టార్ నాని నిర్మాణ సంస్థ ‘వాల్ పోస్టర్ సినిమా బ్యానర్’ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతుందని తెలుస్తుండగా.. మరికొన్ని రోజుల్లో షూటింగ్ ప్రారంభం కానుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వినిపిస్తుంది. ఇందులో హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్‌ను ఫిక్స్ చేశారట మేకర్స్. ఇప్పటికే కథ చెప్పగా.. తన పాత్ర నచ్చడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన రుక్మిణి. అయితే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Next Story