సర్ ప్రక్రియను వేగవంతం చేయాలి

by Taduka Kalyani |

ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. శనివారం కోఆర్డినేటర్లు, మండల పార్టీ అధ్యక్షులు, బూత్ లెవల్ ఏజెంట్లతో ఆయన ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

సర్ ప్రక్రియను వేగవంతం చేయాలి
X

దిశ, సంగారెడ్డి : ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. శనివారం కోఆర్డినేటర్లు, మండల పార్టీ అధ్యక్షులు, బూత్ లెవల్ ఏజెంట్లతో ఆయన ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన ఈ సమావేశంలో సర్ ప్రక్రియకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. ఎన్యుమరేషన్ ఫారాలు అందుకున్న ప్రజలు వాటిని పూర్తి వివరాలతో భర్తీ చేసి సమర్పించేలా బి ఎల్ వో లు సహాయం చేయాలని సూచించారు. ఈ ప్రక్రియలో బిఎల్ఓ లకు బూత్ లెవల్ ఏజెంట్లు పూర్తి సహకారం అందించాలని తెలిపారు. ఒకే చోట కూర్చొని విధులు నిర్వహించడం కాకుండా తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లాలని స్పష్టం చేశారు. ఒక ప్రాంతంలో మాత్రమే అందుబాటులో ఉంటే ఆ విషయం ప్రజలందరికీ ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. మ్యాపింగ్ ప్రకారం పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలకు సంబంధించి బి ఎల్ వో లు, బి ఎల్ ఏల సహకారంతో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు సర్ పై అవగాహన కల్పించి, ఫారాలను భర్తీ చేయించి తిరిగి స్వీకరించాలని సూచించారు. దేశవ్యాప్తంగా గతంలోనూ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం డిజిటలైజేషన్ ప్రక్రియ నిన్నటి వరకు కేవలం 12 శాతం మాత్రమే పూర్తయిందని, ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు పరిరక్షణకు కృషి చేయాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Next Story