2027 వన్డే వరల్డ్ కప్‌కు ముందు విండీస్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్‌ ప్రకటించిన జేసన్ హోల్డర్

by Gantepaka Srikanth |

వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్, మాజీ కెప్టెన్ జేసన్ హోల్డర్ (34) వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

2027 వన్డే వరల్డ్ కప్‌కు ముందు విండీస్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్‌ ప్రకటించిన జేసన్ హోల్డర్
X

దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్, మాజీ కెప్టెన్ జేసన్ హోల్డర్ (34) వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు అతను ఈ నిర్ణయం తీసుకోవడం విండీస్ జట్టుకు పెద్ద దెబ్బేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. జేసన్ హోల్డర్ వన్డేలకు గుడ్ బై చెప్పిన విషయాన్ని వెస్టిండీస్ జట్టు హెడ్ కోచ్ డారెన్ సమీ స్వయంగా వెల్లడించారు. తాజాగా 'వీస్డెన్ క్రికెట్ పాడ్కాస్ట్'లో మాట్లాడిన సమీ.. హోల్డర్ వన్డే క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా వ్యాఖ్యానించారు.

హోల్డర్ వన్డే కెరీర్ రికార్డులు..

వెస్టిండీస్ జట్టులో అత్యంత నమ్మకమైన ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకున్న జేసన్ హోల్డర్ వన్డేల్లో అద్భుతమైన ట్రాక్ రికార్డును కలిగి ఉన్నారు. మొత్తం 138 వన్డేలు ఆడిన సమి.. 2237 పరుగులు చేశారు. 159 వికెట్లు పడగొట్టారు. టెస్టులు, టీ20 ఫార్మాట్లపై మరింత దృష్టి పెట్టేందుకే హోల్డర్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ఒక మేజర్ టోర్నీకి ముందు కీలకమైన సీనియర్ ప్లేయర్ జట్టుకు దూరం కావడంపై విండీస్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story