- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Apple-OpenAI: ఓపెన్ఏఐపై యాపిల్ భారీ ఆరోపణలు
మాజీ యాపిల్ ఉద్యోగులు, ఓపెన్ఏఐతో కలిసి కంపెనీకి చెందిన ప్రొడక్షన్ డిజైన్లు, తయారీ ప్రక్రియ, సరఫరా వ్యూహాలు వంటి అత్యంత గోప్యమైన సమాచారాన్ని ఓపెన్ఏఐకి చేరవేశారని ఆరోపించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ రంగంలోని దిగ్గజాలు యాపిల్, ఓపెన్ఏఐ మధ్య వివాదం ఇప్పుడు కోర్టుకు చేరింది. వినియోగదారుల హార్డ్‌వేర్ మార్కెట్‌లోకి ఓపెన్ఏఐ వేగంగా అడుగుపెడుతున్న సమయంలో, తమ వాణిజ్య రహస్యాలను అక్రమంగా ఉపయోగించుకుందని ఆరోపిస్తూ యాపిల్ అమెరికాలో దావా వేసింది. నార్త్ కాలిఫోర్నియా జిల్లా కోర్టులో దాఖలైన ఫిర్యాదులో, మాజీ యాపిల్ ఉద్యోగులు, ఓపెన్ఏఐతో కలిసి కంపెనీకి చెందిన ప్రొడక్షన్ డిజైన్లు, తయారీ ప్రక్రియ, సరఫరా వ్యూహాలు వంటి అత్యంత గోప్యమైన సమాచారాన్ని ఓపెన్ఏఐకి చేరవేశారని ఆరోపించింది. లియు కంపెనీ ల్యాప్‌టాప్‌ను తిరిగి ఇవ్వకుండా ఇంటర్నల్ నెట్‌వర్క్‌లోని రహస్య ఫైళ్లు డౌన్‌లోడ్ చేశాడని, టాన్ యాపిల్ సరఫరాదారుల సమాచారం, ఇంటర్నల్ ఇండస్ట్రీ రిపోర్టులను తన వ్యక్తిగత ఈమెయిల్‌కు పంపుకున్నాడని యాపిల్ కోర్టుకు తెలిపింది. అంతేకాకుండా, ఓపెన్ఏఐ ఇంటర్వ్యూల కోసం యాపిల్ హార్డ్‌వేర్ భాగాలను తీసుకురావాలని ఉద్యోగులను కోరినట్టు కూడా ఆరోపించింది.
యాపిల్ చేసిన ఫిర్యాదు చేసిన వివరాల ప్రకారం, ప్రస్తుతం 400 మందికి పైగా మాజీ యాపిల్ ఉద్యోగులు ఓపెన్ఏఐలో పనిచేస్తుండటంతో, కంపెనీ రహస్య సమాచారం దుర్వినియోగమయ్యే ప్రమాదం పెరిగిందని పేర్కొంది. ఓపెన్ఏఐ ఉద్యోగులు యాపిల్ సరఫరాదారుల నుంచి కూడా రహస్య సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించారని, యాపిల్‌కు చెందిన ప్రత్యేక మెటల్ ఫినిషింగ్ టెక్నాలజీని అనుమతి లేకుండానే ఉపయోగించారని ఆరోపించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కోర్టులో పోరుకు దిగిన ఈ రెండు కంపెనీలు వ్యాపార పరంగా మాత్రం ఇప్పటికీ భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. యాపిల్ ఇంటెలిజెన్స్‌లో చాట్‌జీపీటీ సేవలను ఇప్పటికే యాపిల్ అందిస్తోంది. అయితే ఏఐ, హార్డ్‌వేర్, స్కిల్స్, మేధోసంపత్తి విషయంలో పెరుగుతున్న పోటీ ఇప్పుడు ఈ భాగస్వామ్యానికి కూడా తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.






