- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయాలు కాదు నాకు ప్రజలే ముఖ్యం.. ఎంపీ ఈటల మరో ఆసక్తికర వ్యాఖ్యలు
మూసీ పునరుజ్జీవనానికి తాము వ్యతిరేకం కాదని, కానీ పేదల ఇండ్లను కూల్చడం సరైంది కాదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మూసీ ప్రక్షాళన మూసీ పునరుజ్జీవంకు ఎవరం వ్యతిరేకులం కాదని మూసీలో చేపలు పట్టేలా అందులో ఈతలు కొట్టే పరిస్థితులు రావాలని కోరుకుంటున్నామని మల్కాజిగిరి ఎంపీ ఈటీల రాజేందర్ అన్నారు. అయితే విద్యార్థులకు ఫీజు రియింబర్స్ మెంట్స్ ఇవ్వడానికే నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం మూసీ పేరుతో లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఇవాళ లకిడీకపూల్ లో నిర్వహించిన తెలంగాణా రాష్ట్రీయ లోక్ దళ్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఈటల.. మూసీ అనగానే చాలా మంది ప్రభుత్వ భూముల్లో ఇండ్లు కట్టుకున్నారేమో అనుకుంటున్నారని ఇది తప్పు అన్నారు. నదులకు ఎక్కడా బఫర్ జోన్లు, ఎఫ్ టీఎల్‍లు ఉండవన్నారు. నదులన్నీ ప్రవైట్ భూముల్లోనే ఉంటాయన్నారు. నదులు ప్రవహిస్తూ ప్రవేట్ భూముల గూండా వెళ్తాయన్నార. నదికి ప్రభుత్వ భూమి అని చెప్పేందుకు ఎక్కడా ఆధారాలు ఉండవన్నారు. కాకాపోతే నది నాలా అని మాత్రమే మార్క్ చేస్తారన్నారు. అంతే తప్ప నదులను ఆక్రమించుకున్నారని ఆరోపణలు చేయడం సుద్ధ తప్పు అన్నారు.
అసలు మీ ఉద్దేశం ఏంటి?:
హైదరాబాద్‍లోని అనేక బస్తీల్లో మూసీ పరివాహన ప్రాంతంలో ఉంటున్న పేదలు ఒక తరం పూర్తిగా కష్టపడ్డాక రెండో తరం వేసుకున్న రేకుల షెడ్డులు కూల్చడం ఏంటని ప్రశ్నించారు. మల్టీ ప్లెక్సులు కట్టడానికి మూసీ అక్కర్లేదు కదా అని ప్రశ్నించారు. అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? మూసీలో మంచినీరు ప్రవహించేలా చేయడమా లేక మూసీ ఇరువైపుల మల్టీ ప్లెక్సీలు నిర్మించి డబ్బులు సంపాదించడమా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి తాను ఒకటే సూచన చేస్తున్నానని ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ ప్రయారిటీ ఏంటో తెలుసుకోవాలన్నారు. ఐదేళ్లకు మాత్రమే ఇస్తారన్నారు. గతం ప్రభుత్వం, అధికారులు అనుమతులు ఇచ్చి ఇప్పుడు మరో ప్రభుత్వం వాటిని మార్చి వేస్తుంటే అసలు ప్రభుత్వం అంటే ఎవరు అని ప్రశ్నించారు. కూకట్ పల్లి నల్ల చెరువు కూల్చివేతల సమయంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుందన్నారు. చెరువుల్లో ఉన్న ప్రైవేట్ భూములను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. జహహర్ నగర్ డంపింగ్ యార్డ్ విషయంలో గతంలో సుప్రీంకోర్టులో కేసు వేసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాజకీయాల కంటే ప్రజలే ముఖ్యం అని ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవారన్నారు. ఎంత గొప్ప పదవిలో ఉన్నావనేది ముఖ్యం కాదు ఆ పదవిలో ఉండి ఎవరి కోసం పని చేస్తున్నావన్నదే ముఖ్యం అన్నారు.






