- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ నాయకుల కుట్రను అడ్డుకుంటాం..
తూప్రాన్‌లోని పాత మున్సిపల్ కార్యాలయ భవనాన్ని కబ్జా చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు

దిశ, తూప్రాన్: తూప్రాన్‌లోని పాత మున్సిపల్ కార్యాలయ భవనాన్ని కబ్జా చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. శనివారం తూప్రాన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా గ్రామ పంచాయతీ కార్యాలయంగా, తర్వాత మున్సిపల్ కార్యాలయంగా ఉపయోగించిన ప్రభుత్వ భవనంపై కొందరు తప్పుడు పత్రాలతో హక్కులు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. గతంలో మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన ఖాజా మొహినుద్దీన్ ప్రభుత్వ ఆస్తికి సంబంధించిన రికార్డుల్లో మార్పులు చేసి, తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపించారు. ఆ నివేదిక ఆధారంగా సుమారు రూ.20 కోట్ల విలువైన మున్సిపల్ స్థలాన్ని కాంగ్రెస్ నాయకులకు అప్పగించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ వ్యవహారంలో మంత్రి అజారుద్దీన్ వ్యక్తిగత సహాయకుడి అండతో స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని వంటేరు ప్రతాప్ రెడ్డి విమర్శించారు. ప్రజా ఆస్తులను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా పోరాడుతుందని, ఎలాంటి అక్రమాలకు తావివ్వబోమన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ స్థలంలో ఆధునిక మార్కెట్ నిర్మిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్‌తో పాటు కాశిరెడ్డి, కౌన్సిలర్ జైపాల్ రాథోడ్, సత్యలింగం, రాములు తదితర నాయకులు పాల్గొన్నారు.






