- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టీరింగ్‌లో సాంకేతిక లోపం
by Ratna Kumari |
ఫరూఖ్‌నగర్ మండలంలో ఇటుకల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఓ కార్మికుడు గాయపడ్డాడు.

X
దిశ, షాద్‌నగర్ : ఫరూఖ్‌నగర్ మండలంలో ఇటుకల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఓ కార్మికుడు గాయపడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం, బాలానగర్ నుంచి షాద్‌నగర్‌కు ఇటుకల లోడుతో వెళ్తున్న లారీ సోలిపూర్ గ్రామ శివారులోని చెర్ల తండా సమీపానికి రాగానే స్టీరింగ్‌లో సాంకేతిక లోపం ఏర్పడి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న కార్మికుడికి తలకు గాయాలు కావడంతో స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై ఇతర వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Next Story






