- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబ్బు సంచులతో దొరికిన దొంగవు నీవు
డబ్బు సంచులతో దొరికిన దొంగవు నీవు, దొంగను దొంగలెక్కనే ప్రజలు చూస్తారని, బీజేపీతో మీ గురువు చంద్రబాబుతో కలిసి చీకటి ఒప్పందం చేసుకొని బెయిల్ పై బయట తిరుగుతున్న నీవు సుద్దులు చెబితే వినే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరని సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మండిపడ్డారు.

దిశ, కొత్తగూడెం ప్రతినిధి : డబ్బు సంచులతో దొరికిన దొంగవు నీవు, దొంగను దొంగలెక్కనే ప్రజలు చూస్తారని, బీజేపీతో మీ గురువు చంద్రబాబుతో కలిసి చీకటి ఒప్పందం చేసుకొని బెయిల్ పై బయట తిరుగుతున్న నీవు సుద్దులు చెబితే వినే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరని సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మండిపడ్డారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సమావేశం పెట్టిన బీ ఆర్ ఎస్ పార్టీ నీ, మా నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకుందని, ఈ 30నెలల కాలంలో చేసినవి ఏమి లేకనే తమపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. సీ ఎం మాట్లాడే బూతులకు మహిళలు చెవిలో దూది పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.
ఎన్నికలలో ఇచ్చిన గ్యారంటీలు, హామీలు అమలు చేసే సత్తా లేకనే అవాకులు చెవాకులు పేలుతున్నాడని విమర్శించారు. రైతు భరోసా అన్నావు రెండు సంవత్సరాలు రైతుల ఖాతాలో వేయకుండా ఎగ్గొట్టవని, రైతు కూలీలకు 15వేలు ఇస్తాననీ మాట తప్పినవని, రైతు కూలీల ఖాతాలో ఒక్క రూపాయ వేసిన మేమంతా ముక్కు నెలకు రాస్తామని , మరి హామీ నెరవేర్చని మీ మంత్రులు ముక్కు నేలకు రాస్తారా అని సవాల్ విసిరారు. రైతులకు నమ్మక ద్రోహం చేసిన నీకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, నీ లక్కీ నెంబర్ 9 కాబట్టే వచ్చే ఎన్నికలలో 117 సీట్లు గెలుస్థామని ప్రకటించావు కానీ మొత్తం 9 సీట్లు గెలిస్తేచాలని , బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో 10కి 10 గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన నీవు ప్రాజెక్ట్ ను మరి రిపేర్ చేయించకుండా దాని పిల్లర్ల కింద ఇసుక తీసుకొని రవాణా చేయడం నీ అవినీతికి తార్కాణం అని విమర్శించారు. సీతారామ ప్రాజెక్ట్ నీటితో భద్రాద్రి జిల్లా రైతులను విస్మరించి , ఖమ్మం రైతులకు న్యాయం చేసిన మంత్రులకు ఈ ప్రాంత రైతుల కష్టాలపై పట్టింపు లేదా అని ప్రశ్నించారు.
జిల్లాలో సుమారు 100 మంది రైతులు చనిపోయారని రైతు బీమా కోసం వారి కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని, వారికి ఇప్పటిదాకా రైతు బంధు జమ చెయ్యకుండా మంత్రులు టైమ్ పాస్ చేస్తున్నారని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారుల వద్ద దాదాపు 2.50 లక్షలు ఇసుక, సున్నం, మేస్త్రిల ఖర్చు పేరుతో అడ్వాన్స్ తీసుకున్న మీ మంత్రులకు, ఎమ్మెలకు మాట్లాడే అర్హత లేదన్నారు. పండించిన పంటను కొనుగోలు చేసే దమ్ము, ధైర్యం , తెలివి ఏమిలేవని, డిల్లీ మెడలు వంచి ధాన్యాన్ని కొనుగోలు చేయించామని, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం చేతులెత్తేసి పనికిరాని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ పదేళ్లలో ఏనాడు కరెంట్ కష్టాలు లేవని, రైతులు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, మీ రెండున్నరేళ్ల పాలనలో కరెంట్ కష్టాలు, ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
మీ రెండున్నరేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి చూపించే దమ్ము మీకు ఉందా అని ప్రశ్నించారు. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామని ప్రజలు ఎవరికి బ్రహ్మరథం పడతారో అప్పుడు తెలుస్తుందని సవాల్ విసిరారు. మీరు ఇలాగే తిట్టుకుంటూ, ఇచ్చిన గ్యారంటీ లు, హామీలను ఎగ్గొట్టుకుంటూ కాలయాపన చేయడం తప్ప మీరు చేసేదేమి లేదని, వచ్చే ఎన్నికల్లోబీ ఆర్ ఎస్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాయకులు కాపు సీతా లక్ష్మి, కొట్టి వెంకటేశ్వర రావు, సంకుబపన అనుదీప్, వేల్పుల దామోదర్, రాజు గౌడ్, కార్పొరేటర్ సింధు తపస్వి, తదితరులు పాల్గొన్నారు .






