స్విమ్‌సూట్‌లో అప్సరా రాణి గ్లామర్ ట్రీట్.. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న భామ!

by Pulgam srinivas |   (  Updated:2026-07-11 10:14:32  IST  )

స్విమ్‌సూట్‌లో సెగలు రేపుతున్న అప్సర రాణి.

స్విమ్‌సూట్‌లో అప్సరా రాణి గ్లామర్ ట్రీట్.. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న భామ!
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ అప్సర రాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె అసలు పేరు అంకిత మహారాణా. ఒడిశాలో జన్మించిన అప్సర రాణి, డెహ్రాడూన్‌లో పెరిగింది.




2019లో విడుదలైన '4 లెటర్స్' చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ భామ, ఆ తర్వాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'థ్రిల్లర్' సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన 'క్రాక్' చిత్రంలోని ఐటమ్ సాంగ్‌లో మెరిసిన అప్సర రాణి, తన గ్లామర్‌తో పాటు డాన్స్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.




దీంతో ఈమెకు వరుసగా అవకాశాలు వస్తాయని చాలామంది భావించారు. అయితే ఆశించిన స్థాయిలో పెద్ద సినిమాల్లో అవకాశాలు మాత్రం రాలేదు. సినిమాల్లో ఎంత గ్లామర్‌గా కనిపిస్తుందో, సోషల్ మీడియాలో కూడా అంతే హాట్‌గా అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది అప్సర రాణి.




తరచూ తన గ్లామరస్ ఫోటోషూట్లను సోషల్ మీడియాలో పంచుకుంటూ నెటిజన్ల దృష్టిని తనవైపు తిప్పుకుంటుంది. ఆమె పోస్ట్ చేసే చాలా ఫోటోలు క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి. తాజాగా మరోసారి తన స్టైలిష్ లుక్‌తో సోషల్ మీడియాలో సందడి చేసింది.




స్కై బ్లూ కలర్ స్విమ్‌సూట్‌లో స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ, మరోవైపు పచ్చని ప్రకృతి మధ్య స్టైలిష్ పోజులతో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోల్లో అప్సర రాణి గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో, ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story