- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.16.92 కోట్లతో కోదాడకు ఆధునిక ఆర్టీసీ బస్‌స్టేషన్ డిపో
తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన కోదాడ పట్టణానికి మరో కీలక అభివృద్ధి ప్రాజెక్టు దక్కింది.

దిశ, కోదాడ : తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన కోదాడ పట్టణానికి మరో కీలక అభివృద్ధి ప్రాజెక్టు దక్కింది. రూ.16.92 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక టీఎస్ ఆర్టీసీ బస్సు డిపో, బస్సు స్టేషన్‌కు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ కోదాడను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కోదాడలో కార్పొరేట్ స్థాయి ప్రమాణాలతో అత్యాధునిక మోడల్ బస్సు స్టేషన్, బస్సు డిపోను నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజూ సుమారు 30 లక్షల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. గత ప్రభుత్వం టీఎస్‌ఆర్టీసీ సంస్థతో పాటు కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా ఒకే ప్రాజెక్టుగా బస్సు స్టేషన్, బస్సు డిపో నిర్మాణానికి రూ.17 కోట్లకు చేరువైన నిధులు కేటాయించడం సంతోషకరమని అన్నారు.
సుమారు ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక సౌకర్యాలతో మోడల్ బస్సు స్టేషన్, డిపోను నిర్మించనున్నట్లు తెలిపారు. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన కోదాడకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేలా ఈ నిర్మాణం ఉంటుందని చెప్పారు. కోదాడ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొస్తామని ఉత్తమ్ పేర్కొన్నారు. అధిక నిధులు కేటాయిస్తూ కోదాడను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన అనంతరం ప్రయాణికులకు విశాలమైన వేచి ఉండే హాల్లు, ఆధునిక టికెట్ కౌంటర్లు, డిజిటల్ సమాచార వ్యవస్థ, పార్కింగ్ సౌకర్యం, బస్సుల నిర్వహణకు అత్యాధునిక డిపో, ఉద్యోగులకు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో కోదాడ మాత్రమే కాకుండా తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందనున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, ఆర్టీసీ ఎండి వై నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్, మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నబాబు, వైస్ చైర్ పర్సన్ దేవరపల్లి మల్లేశ్వరి, ఆర్డీవో సూర్యనారాయణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, టీపీసీసీ డెలికేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, రిజినల్ మేనేజర్ జోష్ణ, ఆర్టీసీ డీఎం శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.






