- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో చేర్చడం మా లక్ష్యం : తహసీల్దార్ ముజీబ్
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ - ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా మద్నూర్ మండల కేంద్రంలో శనివారం ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ ముజీబ్ తెలిపారు.

దిశ, మద్నూర్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ - ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా మద్నూర్ మండల కేంద్రంలో శనివారం ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ ముజీబ్ తెలిపారు. మద్నూర్ గ్రామంలోని నడిమి హనుమాన్ మందిరం, గాంధీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌లలో రెవెన్యూ సిబ్బంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు నింపడంలో సహాయం చేశారు. సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేశారు. ఎవరూ ఫారం నింపడానికి ఇబ్బంది పడొద్దు. ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో సక్రమంగా నమోదు అయ్యేలా చూడటమే మా లక్ష్యం" అని తహసీల్దార్ అన్నారు.
ఆదివారం కూడా హెల్ప్ డెస్క్..
ఆదివారం 12.07.2026న ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రభుత్వ బాలుర పాఠశాల, మద్నూర్ వద్ద హెల్ప్ డెస్క్ ఉంటుందని, ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ ఖలీద్, గిర్దావర్ మురళీధర్, రవి కుమార్, బాలరాజు, బిఎల్ఓలు దినకర్, సత్యం, సురేష్, స్వామి, రమేష్, కృష్ణ, శ్రీకాంత్, ప్రజలు పాల్గొన్నారు.






