- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాట్ ఏన్ ఐడియా సర్ జీ.. పాప్ సింగర్ పెళ్లి చెత్తతో రూ.లక్షలు సంపాదించాడు!
సెలబ్రిటీ జంట వివాహవేడుకల్లో బయటపడిన చెత్తని అమ్మి ఓ వ్యక్తి లక్షలు సంపాదించడం వైరల్ గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: అంతర్జాతీయ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ (Taylor Swift), ఎన్‌ఎఫ్ఎల్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ కెల్స్ (Travis Kelce) జంట జులై 3న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గత మూడేళ్లుగా సాగుతున్న ఈ సెలబ్రిటీ జంట ప్రేమాయణానికి న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వేదికగా జరిగిన పెళ్లి వేడుకతో శుభం కార్డు పడింది. ఈ వేడుకకు హాలీవుడ్, సంగీత ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. అయితే ఈ సెలబ్రెటీ జంటకు ఉన్న క్రేజ్‍ను వాడుకుని వీరి పెళ్లి వేదిక బయట పడేసిన చెత్తను అమ్మి ఓ వక్తి ఏకంగా లక్షలు సంపాదించాడు. వినడానికి వింతగా ఉన్నా ఈ విచిత్ర ఘటన ఇప్పుడు న్యూయార్క్ లో వైరల్‍గా మారింది.
గంటల్లోనే హాట్ కేకుల్లా సేల్!
ఈ పెళ్లికి వందలాది మంది సెలబ్రిటీ అతిథులను హాజరుకాగా వేలాది మంది అభిమానులు తమ అభిమాన సింగర్ పెళ్లి వేడుకను చూసేందుకు అవకాశం లేకపోయిన వేదిక బయట నిలబడ్డారు. పెళ్లి వేదిక బయట అభిమానులు తాము నిలబడిన ప్రాంతాల్లో రోడ్లపై సిగరెట్ పీకలు, బాటిల్ మూతలు, ప్లాస్టిక్ స్ట్రాలు, స్పూన్ల వంటి చెత్త బయట పడేశారు. వాటిని చూసిన న్యూయార్క్‌కు చెందిన కళాకారుడు జస్టిన్ గిగ్నాక్‍కు అద్భుతమైన ఆలోచన వచ్చింది. వెంటనే మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వెలుపల అభిమానులు వదిలేసిన చెత్తను సేకరించడం మొదలు పెట్టాడు. అక్కడ పారేసిన చెత్తా చెదారంతో పాటు పోలీస్ హెచ్చరిక టేప్, రింగ్ పాప్ క్యాండీ ర్యాపర్లు, ఎయిర్‌పాడ్ వంటి దొరికిన వస్తువును కలెక్ట్ చేశాడు. ఈ చెత్తను చిన్న ప్లాస్టిక్ క్యూబ్‌లలో సీల్ చేసి, వాటికి 'స్కల్ప్చర్స్' పేరుతో విక్రయానికి పెట్టాడు. పెళ్లి థీమ్‌ను ప్రతిబింబించేలా కొన్ని వస్తువులను కలిపి ప్యాక్ చేసి, వాటిపై "JUST & T MARRIED" అనే ముద్ర కూడా వేశాడు. ఈ ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో విక్రయానికి పెట్టిన 24 గంటల్లోనే పూర్తిగా అమ్ముడయ్యాయి. ఒక్కో క్యూబ్‌ను 25 డాలర్లు (సుమారు రూ.2,400) ధర నిర్ణయించగా, దాదాపు 50 క్యూబ్‌లు అమ్ముడయ్యాయి. దీంతో మొత్తం 1,250 డాలర్లు (సుమారు రూ.1.2 లక్షలు) ఆదాయం పొందినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
బయటి చెత్తతోనే ఇంత:
ఈ సందర్భంగా గిగ్నాక్ మాట్లాడుతూ.. న్యూయార్క్‌లో చోటుచేసుకునే చారిత్రక, సాంస్కృతిక సంఘటనలను గుర్తుగా భద్రపరచడం నాకు ఇష్టం అని టేలర్ స్విఫ్ట్ వివాహం కూడా అలాంటి అరుదైన సంఘటన కావడంతో ఆ క్షణానికి సంబంధించిన జ్ఞాపకాన్ని సేకరించాలని అనుకున్నానని చెప్పాడు. అయితే తాను సేకరించిన చెత్త అంతా వివాహ వేదిక వెలుపల ప్రజలు వదిలేసినదేనని వేదిక లోపల నుంచి ఎలాంటి వస్తువులు తీసుకురాలేదని గిగ్నాక్ స్పష్టం చేశాడు. ఈ సంగతి తెలిసిన వారంతా గిర్నాక్ అడియా కిరాక్ అని ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అని ప్రశంసిస్తున్నారు.






