కమ్యూనిస్టు దిగ్గజం హనుమంతరావు మృతి

by Batti.Sumithra |

కమ్యూనిస్టు రాజకీయాల్లో దిగ్గజంగా పేరొందిన సంకినేని హనుమంతరావు (85) శనివారం ఉదయం కన్నుమూశారు.

కమ్యూనిస్టు దిగ్గజం హనుమంతరావు మృతి
X

దిశ, తుంగతుర్తి : కమ్యూనిస్టు రాజకీయాల్లో దిగ్గజంగా పేరొందిన సంకినేని హనుమంతరావు (85) శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుంగతుర్తి మండల కేంద్రంలోని తన నివాసానికే పరిమితమయ్యారు. సీపీఎం పార్టీలో సుదీర్ఘకాలం పాటు సేవలందించిన హనుమంతరావు గతంలో తుంగతుర్తి గ్రామానికి ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అప్పటి సర్పంచ్ ఎలమంచయ్య నిరక్షరాస్యుడు కావడంతో గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో హనుమంతరావు ముందుండి కీలక పాత్ర పోషించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉత్తమ కాంట్రాక్టర్ అవార్డు గ్రహీత సంకినేని కృష్ణారావు, బీజేపీ నేత సంకినేని రవీందర్‌రావు, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, ప్రముఖ న్యాయవాది గుడిపూడి వెంకటేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు, మండల పార్టీ కార్యదర్శి బుర్ర శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ తాటి విజయమ్మ, పల్ల సుదర్శన్, సర్పంచ్ మల్లెపాక సాయిబాబు తదితరులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

Next Story