- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్తులకు అలర్ట్.. తిరుమల శ్రీవారి దర్శనం క్యూలైన్ మూసివేత
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి చేసింది. వారాంతం కావడంతో శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి చేసింది. వారాంతం కావడంతో శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. శనివారం ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్సులన్నీ భక్తులతో నిండి.. బాటగంగమ్మ గుడి వరకూ క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. మధ్యాహ్నానికి క్యూలైన్లోకి వచ్చే భక్తుల సంఖ్య అమాంతం పెరిగిపోవడంతో.. టీటీడీ అధికారులు క్యూలైన్లోకి ఎంట్రీ మూసివేశారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో కొద్దిగంటలపాటు క్యూలైన్లలోకి రావొద్దని, భక్తులు ఇబ్బంది పడొద్దని కోరారు. ఇందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వాహనాల రద్దీ సైతం అధికంగా ఉండటంతో భక్తులు పార్కింగ్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. రుయా ఆస్పత్రి కూడలి నుంచి ఇస్కాన్ ఆలయం మీదుగా బస్టాండ్ కు వాహనాలను మళ్లిస్తున్నారు.
మరోవైపు తిరుమలకు నేడు వీఐపీలు క్యూ కట్టారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్, ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీనివాసరెడ్డి, కర్ణాటక మంత్రి మునియప్పన్, మాజీ ఎమ్మెల్యే రేవన్న, రాజస్థాన్ మంత్రి కె.కె. విష్ణోయ్ లు శ్రీవారిని దర్శించుకున్నారు.






