- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొదటి రోజే గట్టిగా కొట్టిన 'లెనిన్'.. పెద్ద హిట్ గ్యారంటీ
'లెనిన్' చిత్రానికి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.16.7 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్ సరైన హిట్ కోసం చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఆయన 'అఖిల్' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నటించిన 'హలో', 'మిస్టర్ మజ్ను', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', 'ఏజెంట్' చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయాయి. దీంతో దాదాపు మూడేళ్ల విరామం తర్వాత 'లెనిన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా నిన్న విడుదలైంది. మొదటి నుంచే చిత్రబృందం ఈ సినిమాపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ప్రచారం చేయడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఆ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి సూపర్ పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజు గట్టి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన అధికారిక వివరాల ప్రకారం, 'లెనిన్' చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.16.7 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. రెండో రోజు కూడా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడం ఖాయమని, చాలా కాలంగా అఖిల్ ఎదురుచూస్తున్న సాలిడ్ హిట్ ఈ చిత్రంతో ఆయన ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులతో పాటు అక్కినేని అభిమానులు కూడా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
మరి పూర్తి బాక్సాఫీస్ రన్ ముగిసే సమయానికి ఈ సినిమా ఎంత మేర కలెక్షన్లు రాబట్టి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.






