- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరుగురి హత్యల ఘటనలో అనాథగా మిగిలిన మానసిక వికలాంగురాలు
by Ratna Kumari |
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవలాగూడలో జరిగిన ఆరుగురి హత్యల ఘటనలో కుటుంబ సభ్యులను కోల్పోయిన మానసిక వికలాంగురాలు మేఘన పరిస్థితి స్థానికులను కలచివేస్తోంది.

X
దిశ, చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవలాగూడలో జరిగిన ఆరుగురి హత్యల ఘటనలో కుటుంబ సభ్యులను కోల్పోయిన మానసిక వికలాంగురాలు మేఘన పరిస్థితి స్థానికులను కలచివేస్తోంది. తల్లి, చెల్లెలు, నానమ్మ మృతి చెందిన విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేని స్థితిలో ఆమె ఉండటంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు వరుసగా మృతి చెందడంతో మేఘన ప్రస్తుతం అనాథగా మిగిలిందని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఇంట్లో నలుగురు ఆడపిల్లలు ఉండగా, ఇప్పుడు మేఘన ఒక్కరే మిగిలిందని వారు పేర్కొన్నారు. మేఘనకు ప్రభుత్వం తక్షణమే రక్షణ కల్పించడంతో పాటు వైద్య చికిత్స, సంరక్షణ, పునరావాసం అందించాలని గ్రామస్తులు, బంధువులు కోరుతున్నారు. అలాగే ఆమె భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Next Story






