బాలీవుడ్ ‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

by Chukka Sudharani |

ఎన్నో వాయిదాల తర్వాత ఫైనల్‌గా బాలీవుడ్ ‘రామాయణ’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

బాలీవుడ్ ‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
X

దిశ, సినిమా: భారతీయ ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ మూవీ ‘రామాయణ’. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జపుకుంటున్న ఈ మూవీ నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్‌లో రాముడి లుక్ కార్టూన్ షేడ్‌లో రివీల్ చేయగా.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. అయితే ఇటీవల ట్రైలర్ అప్డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. మొదట రామాయణ ట్రైలర్ జులై 18న రాబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ డేట్‌ను వాయిదా వేస్తూ ట్రైలర్ జులై 24న రాబోతుందని కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

‘వేల సంవత్సరాలుగా, రామాయణం తన ధర్మం, మర్యాద, ధైర్యం, కరుణ వంటి శాశ్వత ఆదర్శాల ద్వారా తరతరాలకు స్ఫూర్తినిస్తూ వస్తోంది. ఇప్పుడు, ఇది ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. భారతదేశపు గొప్ప నాగరికతా గాథలలో ఒకటి, భారతీయ సినిమా చరిత్రలో మునుపెన్నడూ ప్రయత్నించని స్థాయిలో ప్రపంచానికి అందించబడింది. రామాయణ ట్రైలర్ జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది’ అని ప్రకటించారు. అయితే.. ట్రైలర్ పోస్టర్ కూడా చాలా సింపుల్‌గా ఉండటంతో ప్రేక్షకులు మరోసారి నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి ట్రైలర్ ఏ రేంజ్‌లో మెప్పిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాగా.. దాదాపు రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మైథలాజికల్ డ్రామాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నారు.

Next Story