మనుషుల ప్రాణాలు అంటే లెక్క లేదా?

by Ratna Kumari |

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని సదాశివనగర్ మండలంలోని వర్గల్ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మనుషుల ప్రాణాలు అంటే లెక్క లేదా?
X

దిశ, సదాశివనగర్ : విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని సదాశివనగర్ మండలంలోని వర్గల్ గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో వంకిపోయిన ఇనుప విద్యుత్ స్తంభానికి లైవ్ వైర్లు తాకడంతో స్తంభంలో విద్యుత్ ప్రవహిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్యపై ఏళ్ల తరబడి విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.

సిమెంట్ స్తంభాల ఏర్పాటు కోసం అనుమతులు వచ్చినప్పటికీ వాటిని అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ ప్రమాదకర పరిస్థితి కారణంగా పశువులు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మనుషుల ప్రాణనష్టం సంభవించేలోపే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దెబ్బతిన్న ఇనుప స్తంభం స్థానంలో కొత్త సిమెంట్ విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేసి ప్రమాదాన్ని నివారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Next Story