ఆరు కళ్లున్న మీరు ఏం చేశారు?.. సీఎం, మంత్రులపై పువ్వాడ అజయ్ ఫైర్

by Gantepaka Srikanth |

తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా వ్యక్తిగత దూషణలే సీఎం రేవంత్ ఎజెండాగా పెట్టుకున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

ఆరు కళ్లున్న మీరు ఏం చేశారు?.. సీఎం, మంత్రులపై పువ్వాడ అజయ్ ఫైర్
X

దిశ, ఖమ్మం: తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా వ్యక్తిగత దూషణలే సీఎం రేవంత్ ఎజెండాగా పెట్టుకున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శనివారం ఖమ్మం నగరంలోని మాజీ మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదంలో నా కన్ను కోల్పోయాను అని గుర్తు చేశారు. ప్రమాదంలో కన్ను కోల్పోతే దానిని పట్టుకొని నా కన్ను మీద కూడా విమర్శలు చేయటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. నా ఒక్క కన్నుతోనే అభివృద్ధి చేసి చూపించానని, ఈరోజు ఆరు కళ్లు ఉన్నాయని ఎంత మేర అభివృద్ధి చేశారో చెప్పాలని సవాలు విసిరారు. నాకు ఉన్న ఒక్క కన్ను తోనే ఎంత గొప్పగా పని చేశానో ఎంత అభివృద్ధి చేశానో ప్రజలకు తెలుసుకున్నారు. నా మీద సీఎం, మంత్రులు కక్ష తీర్చుకునే రీతిలో ఉన్నారని తెలిపారు. విషయ పరిజ్ఞానం లేక ముఖ్యమంత్రి స్థాయి మరిచి కన్ను లేదని పన్ను లేదని దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు‌. వ్యక్తిగత విమర్శలతో తాత్కాలికంగా సంతృప్తి పడతారు తప్ప ఎల్లకాలం ఉండదని తనదైన శైలిలో స్పందించారు. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు కోసం ఎంతో కృషి చేశానని, ఈరోజు ముగ్గురు మంత్రులు జిల్లా కోసం ఏం చేశారో చెప్పాలన్నారు. ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయక డొంకతిరుగుడు మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్టు వేసే సంస్కృతి ఆయనదన్నారు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారన్నారు. నిన్న సీఎం సభలో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేశారని విమర్శించారు.

బస్టాండ్‌లలో బస్సులు లేక ప్రజలు ఇబ్బందులు పడిన సందర్భాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. రైతు భరోసాను మూడు సీజన్లు ఎగవేశారు దాంతో పాటు 420 హమీల్లో ఏదీ సరిగ్గా అమలు చేయలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీరు వారిస్తే కేసీఆర్‌కు గుర్తింపు వస్తుందని, అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఇవ్వకుండా రైతులని ఇబ్బందులు గురి గురి చేస్తున్నారన్నారు. కేసీఆర్ సీతారామ ప్రాజెక్టుకి శ్రీకారం చేసింది కేసీఆర్ అని, నేడు నేనే తెచ్చానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. సీతారామ ప్రాజెక్టు కోసం రూ.9 వేల కోట్లు ఖర్చు చేశాం మీరు ఖర్చు చేసింది పెద్దగా ఏం లేదని విమర్శించారు. మీరు నెత్తిన చల్లుకుని నీళ్లు కేసీఆర్ చేసిన సీతారామ ప్రాజెక్టు కృషి వల్లనే సాధ్యమైందన్నారు. గోదావరిని కృష్ణా నదిలో కలపాలని ఏ నాయకుడు కృషి చేయలేదు.. కేసీఆర్ ఒక్కరే దానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. నీళ్లు దిగువకు పోతుంటే ఏపీలో పట్టిసీమ ద్వారా చంద్రబాబు నీళ్లు ఎత్తి ఎత్తిపోసుకుంటుంటే ఇక్కడ మంత్రులు నిద్రపోతున్నారా అని విమర్శించారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రయోజనాల పట్ల కనీస చిత్తశుద్ధి లేదని, తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్‌జేసీ కృష్ణ, మాజీ సూడా చైర్మన్ బచ్చు విజయకుమార్, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, పట్టణ మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story