- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శేఖర్ కమ్ముల ముందు కొత్త సవాల్.. ఏ నిర్ణయం తీసుకుంటారు?
శేఖర్ కమ్ముల తన తదుపరి సినిమా కోసం కథ సిద్ధం చేసినప్పటికీ, బల్క్ డేట్స్ ఇచ్చే మిడ్-రేంజ్ హీరో దొరకడం సవాలుగా మారినట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. మొదటి నుంచి క్లాస్ చిత్రాలను తెరకెక్కిస్తూ వరుస విజయాలను అందుకున్న ఆయన, దర్శకుడిగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. మంచి క్రేజ్ ఉన్నప్పటికీ శేఖర్ కమ్ముల ఇప్పటివరకు స్టార్ హీరోలతో సినిమాలు చేయకుండా ఎక్కువగా చిన్న, మిడ్-రేంజ్ హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చారు. ఇటీవల ఆయన దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన 'కుబేర' చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
ఇక తన తదుపరి సినిమా కోసం ఇప్పటికే కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఏషియన్ సునీల్ నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో శేఖర్ కమ్ములకు ఒక కొత్త సవాలు ఎదురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజ్ ఉన్న మిడ్-రేంజ్ హీరోలు దాదాపు అందరూ ఒకటి లేదా రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, వెంటనే బల్క్ డేట్స్ ఇచ్చే హీరోను ఎంపిక చేయడం కష్టంగా మారినట్లు సమాచారం. దీంతో ఆయన ఇతర భాషలకు చెందిన హీరోలపై కూడా దృష్టి సారించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ టాలెంటెడ్ దర్శకుడు తన తదుపరి చిత్రాన్ని ఏ హీరోతో తెరకెక్కిస్తారో అనే ఆసక్తి ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది.






