ఎస్సై సస్పెన్షన్‌కు డిమాండ్

by Ratna Kumari |

చండూరు పోలీస్ స్టేషన్ ఎదుట శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.

ఎస్సై సస్పెన్షన్‌కు డిమాండ్
X

దిశ, చండూరు : చండూరు పోలీస్ స్టేషన్ ఎదుట శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. విధుల నిర్వహణలో ఎస్సై ఒకే కులానికి అనుకూలంగా వ్యవహరిస్తూ, ఇతర కులాలకు చెందిన యువకులపై కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల చండూరులో జరిగిన ఓ గొడవకు సంబంధించిన వ్యక్తిని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సంబంధించిన వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్న కారణంగా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వేధింపులకు గురి చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఎస్సై విధుల నిర్వహణలో కుల వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Next Story