- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న నిహారిక.. తాజాగా మరో ఆఫర్ అందుకున్న బ్యూటీ!
వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకుంటున్న ఇన్‌ఫ్లూయెన్సర్ నిహారిక ఎన్‌ఎమ్ ఇప్పుడు బాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీకి సిద్ధం అయింది.

దిశ, సినిమా: యూట్యూబర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా తనకంటూ స్పెషల్ ఈమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఇన్‌ఫ్లూయెన్సర్ నిహారిక ఎన్‌ఎమ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి వెండితెరపై కూడా సక్సెస్ అందుకుంటుంది. ఇప్పటికే తెలుగులో రెండు చిత్రాలు చేసిన నిహారిక.. తాజాగా ‘హృదయం మురళి’ సినిమాతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో నిహారిక ఎన్‌ఎమ్ తన సహససిద్ధమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇలా తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీకి సిద్ధమైంది. బాలీవుడ్‌లో ఈమె నటిస్తున్న చిత్రం ‘భాయ్ తేరా స్టార్ హై’. వివేక్ బి. అగర్వాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రాఘవ్, సంజయ్ కపూర్, బర్ఖా సింగ్, నిహారిక ఎన్‌ఎమ్, చందన్ రాయ్ సన్యాల్ తిదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల కాగా.. నవ్వులు, ఎమోషన్స్ అండ్ రొమాన్స్‌తో సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. దీంతో హిందీలో కూడా నిహారిక ఎంట్రీ గ్రాండ్‌గా ఉండనుందని తెలుస్తుండగా.. ఈమెకు అక్కడ మరో ఆఫర్ దక్కినట్లు సమాచారం. అయితే ఈసారి ఇది ఓ లేడీఓరియెంటెడ్ చిత్రమని టాక్. ప్రస్తుతం కథ చర్చలు జరుగుతుండగా.. త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం. ఇది ఆమె కెరీర్‌లో ఒక ఎగ్జైట్‌మెంట్ ప్రాజెక్ట్ కానుందని తెలుస్తుండగా.. భవిష్యత్తులో మోస్ట్ వాటెంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరనుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.






