ఫిన్లాండ్‌లో అదృశ్యమైన హైద‌రాబాద్ విద్యార్థి మృతి

by Ajay Maddhiboyina |

ఫిన్లాండ్‌లో అదృశ్య‌మైన హైద‌రాబాద్ విద్యార్థి మృతి చెందారు. స‌ముద్రంలో మ‌ణిదీప్ రెడ్డి మృత‌దేహాన్ని అధికారులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి నేర అనుమానాలు లేవ‌ని ఫిన్లాండ్ అధికారులు చెబుతున్నారు.

ఫిన్లాండ్‌లో అదృశ్యమైన హైద‌రాబాద్ విద్యార్థి మృతి
X

దిశ‌, వెబ్ డెస్క్: ఫిన్లాండ్‌లో అదృశ్య‌మైన హైద‌రాబాద్ విద్యార్థి మృతి చెందారు. స‌ముద్రంలో మ‌ణిదీప్ రెడ్డి మృత‌దేహాన్ని అధికారులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి నేర అనుమానాలు లేవ‌ని ఫిన్లాండ్ అధికారులు చెబుతున్నారు. మే నెల నుండి మ‌నిదీప్ రెడ్డి క‌నిపించ‌కుండా పోయారు. మ‌ణిదీప్ కుటుంబం హైర‌దాబాద్ లోని వ‌న‌స్థ‌లిపురం వైదేహిన‌గ‌ర్ లో నివాసం ఉంటోంది. కాగా మ‌ణిదీప్ 2025 ఆగ‌స్టులో ఇంజ‌నీరింగ్ చదివేందుకు ఫిన్లాండ్ వెళ్లాడు. అక్క‌డ ల‌తి ప‌ట్ట‌ణంలోని ఎల్ యూటీ యూనివ‌ర్సిటీలో చ‌దువుతున్నాడు. ఈ యేడాది మే 5న రాజ‌ధాని హెల్సింకి వెళ్లాడు.

మ‌రుస‌టి రోజు నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ రాడంతో అత‌డి స్నేహితుల ద్వారా మే 11న ల‌తి పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. దీంతో కేసు న‌మోదు చేసుకోగా, మే 5న నుండి అత‌డి ఆచూకీ ల‌భించ‌లేదు. దీంతో మ‌నిదీప్ కుటుంబం ఫిన్ లాండ్ లోని ఇండియా ఎంబ‌సీలో ఫిర్యాదు చేసింది. ఇటీవ‌ల హైకోర్టును ఆశ్ర‌యించి ప్ర‌భుత్వం చొర‌వ తీసుకుని త‌మ కుమారుడి ఆచూకీ తెలిపేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. గ‌త కొద్దిరోజులుగా మ‌నిదీప్ ఆచూకీ కోసం కుటుంబం ఆందోళ‌న చెందుతోంది. ఇంత‌లో స‌ముద్రంలో డెడ్ బాడీ గుర్తించ‌డంతో కుటుంబంలో విషాద చాయ‌లు అలుముకున్నాయి.

Next Story