హుజూరాబాద్‌లో ఘనంగా ఉమ్మడి జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

by Jakkula.Mamatha |

హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక హైస్కూల్ మైదానంలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల స్థాయి స్మారక కబడ్డీ పోటీలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

హుజూరాబాద్‌లో ఘనంగా ఉమ్మడి జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
X

దిశ,​హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక హైస్కూల్ మైదానంలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల స్థాయి స్మారక కబడ్డీ పోటీలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు సాగనున్న ఈ క్రీడా సంబరానికి మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని ముఖ్యఅతిథిగా హాజరై, పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ​ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థులు, యువతలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, స్థైర్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఆటల్లో గెలుపోటములు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని చాటుతూ ప్రతిభను కనబరచాలని ఆమె పిలుపునిచ్చారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి సుమారు 40 టీములు ఈ పోటీల్లో తలపడుతున్నాయి. ​ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడా నిర్వాహకులు, వ్యాయామ ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు పాల్గొన్నారు. మైదానమంతా ఆటగాళ్ల కేరింతలు, ప్రేక్షకుల కోలాహలంతో సందడిగా మారింది.

Next Story