- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీఎఫ్ ఖాతాదారులకు తీపికబురు: ఎట్టకేలకు పనిచేస్తున్న EPFO ఈ-పాస్‌బుక్ పోర్టల్
సాంకేతిక సమస్యల తర్వాత ఎట్టకేలకు ఈపీఎఫ్ఓ (EPFO) ఈ-పాస్‌బుక్ పోర్టల్ సేవలు పున:ప్రారంభయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చే న్యూస్ చెప్పింది. గత కొన్ని రోజులుగా టెక్నికల్ ఎర్రర్‌తో నిలిచిపోయిన ఈపీఎఫ్ఓ (EPFO) అధికారిక ‘ఈ-పాస్‌బుక్’ (e-Passbook) పోర్టల్ సేవలు ఎట్టకేలకు పునరుద్ధరించారు. దీంతో పీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో చూసుకోవడానికి, నెలవారీ కంట్రిబ్యూషన్‌ను తనిఖీ చేసుకోవడానికి ఎదురుచూస్తున్న ఇబ్బందులకు తెరపడింది. ఈ సేవలు ఇప్పుడు వెబ్‌సైట్‌తో పాటు ఉమాంగ్ (UMANG) యాప్‌లోనూ సజావుగా అందుబాటులోకి వచ్చాయి.ః
సాంకేతిక లోపంతో నిలిచిపోయిన సేవలు..
అయితే, కొద్దిరోజులుగా ఈపీఎఫ్ఓ పాస్‌బుక్ పోర్టల్ ఓపెన్ చేసినప్పుడు ‘వెబ్‌సైట్ మెయింటెనెన్స్‌లో ఉంది’, సర్వర్ డౌన్’ అనే ఎర్రర్ మెసేజ్‌లు రావడంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది వేతన జీవులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వడ్డీ జమ వివరాలు, విత్‌డ్రా స్టేటస్ చూసుకోవడానికి వీలు పడలేకుండా పోయింది. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన ఐటీ విభాగం పోర్టల్ లోపాలను సరిచేసి మళ్లీ సర్వర్‌ను పూర్తిస్థాయిలో రీస్టోర్ చేసింది. ప్రస్తుతం ఎలాంటి అంతరాయం లేకుండా పాస్‌బుక్ డౌన్‌లోడ్ అవుతోందని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈపీఎఫ్‌వో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు పేర్కొన్నారు.






