అటవీ హక్కుల చట్టం కేంద్ర పరిధిలో ఉంది : మంత్రి జూపల్లి కృష్ణారావు

by Batti.Sumithra |

ఏళ్లుగా అటవీ భూములను సాగు చేసి జీవనం సాగిస్తున్న ట్రైబల్ నాన్ ట్రైబర్ పోడు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అయితే అటవీ హక్కుల చట్టం కేంద్ర పరిధిలో ఉందని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

అటవీ హక్కుల చట్టం కేంద్ర పరిధిలో ఉంది : మంత్రి జూపల్లి కృష్ణారావు
X

దిశ, ఆసిఫాబాద్ : ఏళ్లుగా అటవీ భూములను సాగు చేసి జీవనం సాగిస్తున్న ట్రైబల్ నాన్ ట్రైబర్ పోడు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అయితే అటవీ హక్కుల చట్టం కేంద్ర పరిధిలో ఉందని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కెరమెరి మండలంలో వీఓ నూతన భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనను సిర్పూర్ యు. లింగపూర్, జైనూర్, కెరమెరి మండలాలకు చెందిన పోడు రైతులు ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆధ్వర్యంలో మంత్రిని కలిసి తమ గోడును వినిపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005 కంటే ముందు నుంచి పోడు సాగు చేస్తున్న చాలా మంది రైతులకు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎఫ్వోఆర్వో పట్టారు ఇచ్చామని గుర్తు చేశారు. మరికొంత మంది 50, 60 ఏళ్లుగా సాగు చేస్తున్నా పట్టాలు లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్ట్ అధికారుల నుంచి ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పుకొచ్చారు. అయినా పోడు రైతులను ఇబ్బంది పెట్టొద్దని ఫారెస్ట్ అధికారులకు చెప్పాం.. మళ్లీ పిలిపించి చెప్తామని తెలిపారు. అలాగే కొత్త పోడు కొట్టొద్దని విజ్ఞప్తి చేశారు.

Next Story