- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే షాబాద్ లో ఆరు హత్యలు..!
రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే షాబాద్ మండలంలో ఆరు హత్యలు జరిగాయని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు.

దిశ, చేవెళ్ల: రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే షాబాద్ మండలంలో ఆరు హత్యలు జరిగాయని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. షాబాద్ లో బాధితులను పరామర్శించేందుకు వెళుతుండగా మున్సిపల్ పరిధిలోని మల్కాపూర్ వద్ద చేవెళ్ల పోలీసులు సబితా ఇంద్రారెడ్డి, పద్మ దేవేందర్ రెడ్డిలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. పోక్సో కేసు నమోదైన పోలీసులు సరైన చర్య తీసుకోకపోవడం మళ్లీ ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపించారు. నిందితుడు ఆరు మందిని హతమార్చడం అత్యంత బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య, హోం శాఖలను తన వద్ద పెట్టుకుని అటు పిల్లల భవిష్యత్తును ఇటు శాంతి భద్రతలను గాలికొదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలో మరో పోక్సో కేసులో బండి భగీరథను అరెస్టు చేయడానికి తొమ్మిది రోజులు పట్టడం విచారకరమన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో నిరంకుశ, నిర్బంధ పాలన జరుగుతుందని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ హోంశాఖ వైపల్యమేనని అన్నారు.






