'మసూద' డైరెక్టర్‌తో నాగ చైతన్య నెక్స్ట్ ప్రాజెక్ట్..?

by Pulgam srinivas |

'మసూద' దర్శకుడు సాయి కిరణ్ చెప్పిన హారర్ థ్రిల్లర్ కథను నాగ చైతన్య విన్నట్లు సమాచారం.

మసూద డైరెక్టర్‌తో నాగ చైతన్య నెక్స్ట్ ప్రాజెక్ట్..?
X

దిశ, వెబ్ డెస్క్: దర్శకుడు సాయి కిరణ్ 'మసూద' చిత్రంతో అద్భుతమైన విజయాన్ని అందుకుని మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఈ సినిమా విడుదలై చాలా కాలం గడిచినా, ఆయన తదుపరి చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. తాజాగా ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాయి కిరణ్ ఇప్పటికే ఓ హారర్ థ్రిల్లర్ కథను సిద్ధం చేసుకుని, దానిని ఇటీవల నాగ చైతన్యకు వినిపించినట్లు సమాచారం. కథ మొత్తం విన్న నాగ చైతన్య ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదని తెలుస్తోంది. ఒక వేళ సాయి కిరణ్ చెప్పిన కథకు నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆయన కెరీర్‌లో ఇదే తొలి హారర్ థ్రిల్లర్ చిత్రం కానుంది.

దీంతో ఈ ప్రాజెక్ట్‌పై సహజంగానే మంచి అంచనాలు ఏర్పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే సాయి కిరణ్ – నాగ చైతన్య కాంబినేషన్‌లో సినిమా నిజంగానే పట్టాలెక్కుతుందా లేదా అనే విషయంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ బ్యానర్ నిర్మించే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇక ప్రస్తుతం నాగ చైతన్య, కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వృషకర్మ' చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

Next Story