గోశాల భూమిలో అక్రమ తవ్వకాలపై ఆందోళన

by Ratna Kumari |

భైంసా పట్టణంలోని గోశాల భూమిలో అక్రమంగా మోరం తవ్వకాలు జరుగుతున్నాయంటూ బీజేపీ కౌన్సిలర్ నిమ్మల ప్రవీణ్, గోశాల కమిటీ నాయకులు తవ్వకాలను అడ్డుకుని నిరసన తెలిపారు.

గోశాల భూమిలో అక్రమ తవ్వకాలపై ఆందోళన
X

దిశ, భైంసా : భైంసా పట్టణంలోని గోశాల భూమిలో అక్రమంగా మోరం తవ్వకాలు జరుగుతున్నాయంటూ శనివారం బీజేపీ కౌన్సిలర్ నిమ్మల ప్రవీణ్, గోశాల కమిటీ నాయకులు తవ్వకాలను అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రకృతిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, కొందరు వ్యక్తులు వ్యక్తిగత లాభాల కోసం ప్రకృతి సంపదను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే పట్టణంలోని పలు ప్రాంతాల్లో గుట్టలను అక్రమంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. గోశాల భూమిలో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న అక్రమ తవ్వకాలపై సంబంధిత అధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోయిందని గోశాల కమిటీ నాయకులు పేర్కొన్నారు.

Next Story