- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు బుల్లెట్ ట్రైన్లపై మంత్రి అశ్వినీ కుమార్ వైష్ణవ్ కీలక అప్ డేట్
వచ్చే ఏడాది ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రారంభం కాబోతోందని రైల్వే శాఖ మంత్రి వెల్లడించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కొత్తగా 7 బుల్లెట్ ట్రైన్ కారిడార్లను మోడీ ప్రభుత్వం మంజూరు చేసిందని ఇందులోతెలంగాణకు 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, ముంబయికి కారిడార్లు ఉన్నాయన్నారు. వచ్చే ఏడాది ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రారంభం కాబోతోందని చెప్పారు. ఇవాళ హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన వికసిత్ భారత్ -2047లో సాంకేతికత పాత్ర అంశంపై సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన అశ్వినీ వైష్ణవ్ తెలంగాణకు రైల్వే బడ్జెట్ ను కేంద్రం భారీగా పెంచిందని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి ఇచ్చిన రైల్వే బడ్జెట్ రూ. 880 కోట్లు మాత్రమేనని కానీ మోడీ ప్రభుత్వం కేవలం తెలంగాణకే రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. తెలంగాణకు 4 ఎలక్ట్రానికి పరిశ్రమలకు కేంద్రం అనుమతి ఇచ్చిందని 3 సెమీ కండక్టర్ల పరిశ్రమల్లో ఇప్పటికే ఒక దాంట్లో ప్రొడక్షన్ ప్రారంభమైందన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‍ను ఆధునికంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు నిధులు ఇచ్చామని వందే భారత్ రైలుతో ప్రపంచంలోని ఏ రైలు కూడా సరితూగదన్నారు.






