- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోనసీమ జిల్లాలో ఘోరం.. భర్త పై యాసిడ్ పోసిన భార్య
కోనసీమ జిల్లాలో భర్తపై యాసిడ్ పోసిన భార్య.. ఉద్యోగం పర్మినెంట్ పేరిట భర్త బంధువులు మోసం చేయడమే కారణం.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామంలో భార్యాభర్తల మధ్య జరిగిన తీవ్ర వివాదం కాస్త యాసిడ్ దాడికి దారితీసింది. పులపకూరి అర్జున్ కుమార్ అనే వ్యక్తిపై అతని భార్య దుర్గా భవాని ఇంట్లో ఉండే బాత్రూమ్ క్లీనింగ్ యాసిడ్‌ను ముఖంపై, శరీరంపై పోసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అర్జున్ కుమార్‌ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఉద్యోగం పేరిట మోసం చేయడంతోనే దాడి..
ఈ దాడికి పాల్పడిన దుర్గా భవాని అదే అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు నర్సుగా పనిచేస్తోంది. ఈ ఘాతుకానికి గల కారణాలపై స్థానికంగా ముమ్మర చర్చ సాగుతోంది. దుర్గ భవాని నర్సింగ్ ఉద్యోగాన్ని పర్మినెంట్ చేయిస్తామని భర్త అర్జున్ కుమార్ తరపు బంధువులు నమ్మబలికి, ఆమె వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారని తెలుస్తోంది. అయితే రోజులు గడుస్తున్నా ఉద్యోగం పర్మినెంట్ కాకపోగా, ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వకుండా మోసం చేయడంతో కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి, ఆగ్రహానికి లోనైన దుర్గా భవాని శనివారం భర్తపై యాసిడ్ పోసిందని సమాచారం. ఈ ఘటనపై ముమ్మిడివరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.






