- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
1000 క్షిపణులు సిద్ధం.. ఇరాన్‌కి ట్రంప్ సంచలన హెచ్చరిక
నన్ను చంపాలని చూస్తే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తాం.. 1000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయంటూ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన హెచ్చరిక! టాగ్స్:

దిశ, వెబ్ డెస్క్: ఓ వైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు ఇరాన్ పై అమెరికా భారీ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ట్రూత్ సోషల్' (Truth Social) లో ఇరాన్‌ను ఉద్దేశించి చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికా అధ్యక్షుడైన తనను (ట్రంప్‌ను) హతమార్చేందుకు ఇరాన్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందనే వార్తల నేపథ్యంలో ఆయన ఇరాన్‌కు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ గనుక అలాంటి సాహసానికి ఒడిగడితే ఆ దేశం సర్వనాశనం అవ్వడం ఖాయమని హెచ్చరించారు.
సైన్యానికి ఆదేశాలు జారీ
అమెరికా అధ్యక్షుడిని - అంటే నన్ను హతమార్చడానికి, ఆ ప్రయత్నం చేయడానికి ఇరాన్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా వివిధ వేదికల నుంచి హెచ్చరికలు జారీ చేస్తోంది. ఒకవేళ ఇరాన్ గనుక ఆ చర్యకు పూనుకుంటే.. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ లక్ష్యంగా 1000 క్షిపణులు (1000 Missiles) సిద్ధంగా (Locked and Loaded) ఉంచబడ్డాయి. వాటి వెనుకే మరో వేలాది క్షిపణులు దూసుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన సైనిక ఉత్తర్వులు ఇప్పటికే జారీ అయ్యాయి. ఒక సంవత్సరం కాల పరిమితితో ఇరాన్ లోని అన్ని ప్రాంతాలను పూర్తిగా నాశనం చేయడానికి, తుడిచి పెట్టడానికి అమెరికా సైన్యం సిద్ధంగా, సన్నద్ధంగా ఉందని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్" అని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ ప్రకటనతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం మరింత ముదిరింది.






