Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ గ్లామర్ షో.. హాట్ లుక్స్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్

by Pulgam srinivas |   (  Updated:2026-07-11 06:37:57  IST  )

స్లీవ్‌లెస్ డ్రెస్‌లో హాట్ లుక్స్‌తో ఫిదా చేస్తున్న తమన్నా

Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ గ్లామర్ షో.. హాట్ లుక్స్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటివరకు తెలుగుతో పాటు తమిళం, హిందీ సహా పలు భాషల చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఇక ప్రస్తుతం ఈమెకు తెలుగులో కూడా అవకాశాలు చాలా వరకు తగ్గాయి. ఆఖరుగా తమన్నా, చిరంజీవి హీరోగా రూపొందిన భోళా శంకర్ సినిమాలో హీరోయిన్గా నటించింది.

ఈ మూవీ విడుదలై చాలా కాలమే అవుతుంది. సినిమాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తమన్నా సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో గ్లామర్‌తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది.

తాజాగా తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోల్లో చాక్లెట్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్ ధరించి తన హాట్ లుక్‌ను ఆకట్టుకునేలా ప్రదర్శించింది.

మెడలో రెండు చైన్లు, చేతులకు గాజులు, ఇయర్‌రింగ్స్, వేళ్లకు ఉంగరాలు ధరించి స్టైలిష్‌గా కనిపించింది. ప్రస్తుతం తమన్నా గ్లామరస్ లుక్‌కు సంబంధించిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story