- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బచ్చన్నపేటలో భారీ చోరీ
జనగామ జిల్లా బచ్చన్నపేటలో భారీ చోరీ చోటుచేసుకుంది. ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదును అపహరించారు.

దిశ, బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేటలో భారీ చోరీ చోటుచేసుకుంది. ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదును అపహరించారు. బచ్చన్నపేటకు చెందిన దొంతుల సోమలింగం మోకాలి శస్త్రచికిత్స కోసం భార్యతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లారు. అనంతరం ఈ నెల 8న ఇంట్లో ఉన్న చిన్న కుమారుడు ప్రణయ్ కూడా ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన దొంగలు రాత్రి సమయంలో ఇంటి ప్రధాన తలుపు తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చి చూడగా ప్రధాన ద్వారం తాళం విరిగిపోయి ఉండటంతో అనుమానం వచ్చింది.
లోపలికి వెళ్లి పరిశీలించగా బెడ్‌రూమ్‌లోని బీరువా తెరిచి ఉండగా అందులోని విలువైన వస్తువులు కనిపించలేదు. దొంగలు 9.5 తులాల బంగారు ఆభరణాలు, సుమారు 1.6 కిలోల వెండి వస్తువులు, రూ.50 వేల నగదును అపహరించినట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న బచ్చన్నపేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఆధారాల సేకరణ కోసం క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించి వేలిముద్రలు, ఇతర ఆనవాళ్లను పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన నేపథ్యంలో ప్రజలకు పోలీసులు పలు సూచనలు చేశారు. ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.






