- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'కొరియన్ కనకరాజు' టీజర్ విడుదలకి ముహూర్తం ఖరారు
'కొరియన్ కనకరాజు' చిత్ర టీజర్‌ను వచ్చే వారం విడుదల చేయనున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కొరియన్ కనకరాజు' చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సత్య కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాను ఆగస్టు 7న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సినిమా విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో ప్రమోషన్స్‌ను వేగవంతం చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగా వచ్చే వారం 'కొరియన్ కనకరాజు' టీజర్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. టీజర్ కూడా ఆకట్టుకుంటే ఆ అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్), వై. రాజీవ్ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.






